ONGC Recruitment: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్, జూనియర్ మెరైన్ రేడియో అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ వంటి ఖాళీలు ఉన్నాయి.
* సివిల్, ఎలక్ట్రికల్, జియాలజీ, సర్వేయింగ్, అకౌంట్స్, ప్రొడక్షన్, కెమిస్ట్రీ, జియాలజీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనునన్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అకడమిక్ ప్రతిభ, అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 28-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..