ONGC Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)కి చెందిన ముంబయిలోని వెస్టర్న్ ఆఫ్‌షోర్ యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 81
పోస్టులు:
విభాగాలు: ఫిజీషియన్, పీడియాట్రీషియన్, జనరల్ సర్జన్, పాథాలజీ, గైనకాలజీ, హోమియోపతి తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ. 40,000ల నుంచి రూ.1,00,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌లో మెడికల్ పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 6, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.