ONGC Recruitment 2022: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 36 కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC).. జూనియర్‌ కన్సల్టెంట్‌, అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల (Junior Consultant and Associate Consultant Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను..

ONGC Recruitment 2022: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 36 కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!

Updated on: Mar 23, 2022 | 5:03 PM

ONGC Consultant Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC).. జూనియర్‌ కన్సల్టెంట్‌, అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల (Junior Consultant and Associate Consultant Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 36

పోస్టులు:
జూనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు: 14
అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టులు: 22

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 65 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 40,000ల నుంచి రూ.66,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ కంపెనీలో రిటైర్‌ అయిన అభ్యర్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ3 నుంచి ఈ5 స్థాయిల్లో సంబంధిత పనిలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ECGC PO Recruitment 2022: ఈసీజీసీ లిమిటెడ్‌లో 75 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. ముఖ్య సమాచారం ఇదే!