భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన మంగళూరులోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్.. సెక్యురిటీ, మెడికల్ సర్వీసెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు డిసెంబర్ 15, 2022వ తేదీనాటికి తప్పనిసరిగా 39 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.118లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్/ఎమ్‌ఆర్‌పీఎల్ రెగ్యులర్ ఎంప్లయిస్‌కు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.70,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Senior Manager (HR), Recruitment Section, Mangalore Refinery and Petrochemicals Limited, Kuthethoor Post, Mangalore- 575030, Karnataka.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.