NVS Recruitment 2022: నాన్ టీచింగ్ పోస్టుల కోసం నవోదయ విద్యాలయ సమితి (NVS) విడుదల చేసిన నోటిఫికేషన్ రేపటితో (10 ఫిబ్రవరి 2022) ముగియనుంది. అర్హులైన నిరుద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి. NVS అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగం పొందడానికి ఇది గొప్ప అవకాశం. NVS జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొదలైన 1925 పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ ఎ, బి, సి పోస్టులకు నియామకాలు జరుగుతాయి. అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను నింపవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 12 జనవరి 2022 నుంచి ప్రారంభమైంది. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను చూడవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోండి
1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inకి వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన రిక్రూట్‌మెంట్ సెల్ ఎంపికకు వెళ్లండి.
3. ఇందులో నవోదయ విద్యాలయ సమితిలో వివిధ నాన్-టీచింగ్ పోస్టుల (HQ/RO క్యాడర్ & JNV క్యాడర్) ఖాళీలను భర్తీ చేయడానికి వివరణాత్మక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021-22 లింక్‌కి వెళ్లాలి.
4. ఇప్పుడు అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
5. తర్వాత అడిగిన వివరాలను నింపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
6. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను నింపవచ్చు.
7. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఈ తేదీలను గుర్తుంచుకోండి
రిజిస్ట్రేషన్ ప్రారంభం: 12 జనవరి 2022
రిజిస్ట్రేషన్ చివరితేది 10 ఫిబ్రవరి 2022
ఫీజు సమర్పణ ప్రారంభం: 12 జనవరి 2022
ఫీజు సమర్పణకు చివరి తేదీ: 10 ఫిబ్రవరి 2022
CBT తాత్కాలిక తేదీ: 09.03.2022 నుంచి 11.03.2022 వరకు