Jobs In NTPC: పదో తరగతి అర్హతతో 177 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ.40,000లు జీతం.. పూర్తి వివరాలివే!

|

Jan 31, 2022 | 7:35 AM

భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఝార్ఖండ్‌ (jharkhand)లోని కోల్ మైనింగ్ హెడ్‌క్వర్టర్స్‌ (coal mining headquarters)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs In NTPC: పదో తరగతి అర్హతతో 177 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ.40,000లు జీతం.. పూర్తి వివరాలివే!
Ntpc Limited
Follow us on

NTPC Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఝార్ఖండ్‌ (jharkhand)లోని కోల్ మైనింగ్ హెడ్‌క్వర్టర్స్‌ (coal mining headquarters)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 177

1. మైనింగ్ ఓవర్‌మెన్: 74

అర్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. డీజీఎంఎస్ ఓవర్‌మెన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

2. మైనింగ్ సర్దార్: 103

అర్హతలు: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డీజీఎంఎస్ ఓవర్‌మెన్ సర్టిఫికేట్‌తోపాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 57 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.40,000లు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: 100 మార్కులకు మల్లిపుల్ ఛాయిస్ రూపంలో 100 ప్రశ్నలకు సమాధానం రాయవల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని స్కిల్ టెస్టుకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Jobs In Hyderabad: పీజీ అర్హతతో ఐకార్‌లో యంగ్‌ప్రొఫెషనల్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపికలు!