UGC NET 2024 Admit Cards: వాయిదా పడిన ఆ పరీక్షల కోసం యూజీసీ నెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

సంక్రాంతి పండగ నేపథ్యంలో జనవరి 15వ తేదీన జరగవల్సిన యూజీసీ నెట్ 2024 డిసెంబర్ సెషన్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు తిరిగి జనవరి 21, 30వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీయే రీషెడ్యూల్ ప్రకటించింది కూడా. అయితే తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేసింది..

UGC NET 2024 Admit Cards: వాయిదా పడిన ఆ పరీక్షల కోసం యూజీసీ నెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
UGC NET 2024 Admit Cards

Updated on: Jan 20, 2025 | 6:38 AM

హైదరాబాద్‌, జనవరి 20: యూజీసీ నెట్-2025 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) సంక్రాంతి పండగ నేపథ్యంలో రీషెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 15వ తేదీన ఆయా సబ్జెక్టులకు జరగవల్సిన రాత పరీక్షలను జనవరి 21, 27 తేదీలకు రీషెడ్యూల్‌ చేసినట్లు ఇప్పటికే యూజీసీ ప్రకటించింది కూడా. ఈ రెండు పరీక్షలకు సంబంధించి యూజీసీ నెట్ డిసెంబర్‌ 2024 పరీక్షల అడ్మిట్‌ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీయే) ఎన్‌టీఏ విడుదల చేసింది.

జనవరి 21, 27 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థుల ఫోటో, సంతకం, బార్‌కోడ్, క్యూఆర్‌ కోడ్‌ వీటిలో ఏది సరిగా లేకపోయిన.. తిరిగి మరోమారు అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్ధులు తమ అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత పై వివరాలు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

కాగా మొత్తం 85 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్‌ పరీక్షలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 సెషన్‌ పరీక్షలు తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండగ కారణంగా జనవరి 15వ తేదీన జరగవల్సిన పరీక్ష వాయిదా పడింది. అభ్యర్ధుల విన్నతి మేరకు జనవరి 21, 27వ తేదీలకు ఈ పరీక్ష వాయిదా వేసినట్లు యూజీసీ వెల్లడించింది. యూజీసీ నెట్‌ పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరుగుతుంది. పేపర్‌ 1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌ననెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్‌ మినహా మిగతా అన్ని క్వశ్చన్‌ పేపర్లు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో మాత్రమే వస్తాయి.

ఇవి కూడా చదవండి

యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.