AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE 2025 Main Exam: జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు.. 2025 నుంచి ఛాయిస్ ప్రశ్నలకు స్వస్తి!

జేఈఈ మెయిన్ పరీకల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కోవిడ్ సమయం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చిన ఛాయిస్ విధానానికి స్వస్తి పలకనుంది. ఈ మేరకు తాజాగా ఎన్టీయే ప్రకటన విడుదల చేసింది..

JEE 2025 Main Exam: జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు.. 2025 నుంచి ఛాయిస్ ప్రశ్నలకు స్వస్తి!
JEE 2025 Mains Exam Pattern
Srilakshmi C
|

Updated on: Oct 21, 2024 | 3:24 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 21: జేఈఈ మెయిన్‌ పరీక్షల విధానంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కోవిడ్‌ సమయంలో తీసుకువచ్చిన ఐచ్చిక విధానికి స్వస్తి పలికింది. ఈ మేరకు గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎత్తివేస్తున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. మారిన పరీక్ష విధానం JEE మెయిన్ 2025 నుంచి అమలులోకి రానుంది. విద్యార్థులు ఏ ప్రశ్నలను రాయాలనుకుంటారో వాటినే ఎంచుకోగలిగేలా మునుపటి ఫార్మాట్‌లోకి మారనుంది. ముఖ్యంగా సెక్షన్‌ Bలోని అన్ని ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

సాధారణంగా జేఈఈ మెయిన్‌లో మొత్తం 75 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రం సబ్జెక్టుల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. అయితే కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకే ప్రతి సబ్జెక్టులో ఛాయిస్‌ ప్రశ్నలు ఇవ్వడం ప్రారంభించారు. జేఈఈ మెయిన్‌ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చేవారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాల్సి ఉంటుంది. అయితే సెక్షన్‌ బీలో మాత్రం 10 ప్రశ్నలు ఇచ్చి వాటిల్లో 5 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్‌ ఇస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఉపశమన చర్యగా ఈ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టారు.

2025 నుంచి ఈ సదుపాయాన్ని తొలగించనున్నారు. ఈ మేరకు 2025 నుంచి ఈ ఎంపిక అందుబాటులో ఉండదని NTA స్పష్టం చేసింది. బదులుగా, మునుపటి విధానం మళ్లీ అమలులోకి వస్తుంది. అంటే సెక్షన్ Bలో ఒక్కో సబ్జెక్టుకు 5 తప్పనిసరి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవల్సి ఉంటుంది. కాగా జేఈఈ మెయిన్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

JEE మెయిన్ 2025 తొలి విడత నోటిఫికేషన్ ఎప్పటినుంచంటే

JEE మెయిన్ 2025 తొలి దశ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా NTA ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు, పరీక్షా విధానం గురించి మరింత సమాచారం NTA అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.