NPCIL Recruitment 2021: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అర్హులెవ‌రు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

|

Jun 12, 2021 | 8:09 PM

NPCIL Recruitment 2021: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌) ప‌లు ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫ‌కేష‌న్ జారీ చేశారు. కేంద్ర ర‌క్ష‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే...

NPCIL Recruitment 2021: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అర్హులెవ‌రు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?
Npcil Jobs
Follow us on

NPCIL Recruitment 2021: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌) ప‌లు ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫ‌కేష‌న్ జారీ చేశారు. కేంద్ర ర‌క్ష‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే ఈ సంస్థ‌లో మొత్తం 121 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* మొత్తం 121 పోస్టుల‌కు గాను.. ఎలక్ట్రిషన్ (32), ఫిట్టర్ (32), ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్ (12), ఎలక్ట్రానిక్‌ మెకానిక్ (12), పాసా, వెల్డర్‌, టర్నర్ (7) చొప్పున, మెషినిస్ట్ (6), రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్ (6) ఖాళీల‌ను తీసుకోనున్నారు.

* ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 14 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి.

* ఐటీఐలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* సంబంధిత పూర్తి అంశాల‌ను ద‌ర‌ఖాస్తు ఫామ్‌లో నింపి, అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను జ‌త‌చేసి గుజ‌రాత్‌లోని న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అడ్ర‌స్‌కు పంపిచాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా జూలై 15ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* ఎంపికైన అభ్య‌ర్థులు గుజరాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ప‌ని చేయాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Disabled Students : దివ్యాంగులకు గుడ్‌న్యూస్..! మూడేళ్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన NCPEDP.. మరిన్ని వివరాలు తెలుసుకోండి..

Inter Students : ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేశారంటే జాబ్ గ్యారంటీ..! తక్కువ రోజులలో ఎక్కువ బెనిఫిట్..

Atmanirbhar Bharat: ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అధునాతన లైట్ హెలికాప్టర్ ఎఎల్‌హెచ్ ఎంకె III