NEET PG 2022: నీట్ పీజీ పరీక్ష తేదీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా సమాచారం అందింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా ఫేక్ అని పీఐబీ స్పష్టం చేసింది. NEET PG పరీక్ష తేదీ మే 21, 2022న నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ తేదీలో ఎలాంటి మార్పులు చేయలేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నకిలీ వార్తలను నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. NEET PG 2022ని వాయిదా వేయాలనే డిమాండ్‌ను అభ్యర్థులు సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.
పరీక్ష 23 మే 2022న జరుగుతుంది
NEET PG 2022 వాయిదాకు సంబంధించిన సర్క్యులర్ సోషల్ మీడియాలో నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ తేల్చింది. ఈ వార్తలను విశ్వసించవద్దని, పరీక్షకు సంబంధించిన ఏవైనా అప్‌డేట్‌ల కోసం అధికారిక హ్యాండిల్స్‌ను మాత్రమే చెక్ చేయాలని సలహా ఇచ్చింది. NEET PG 2022 పరీక్ష ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ మార్చి 25న క్లోజ్ అయింది. పరీక్ష మే 21, 2022న నిర్వహిస్తారు. ఇందులో ఏ మార్పులేదు.
NEET PG 2022 అప్లికేషన్ పోర్టల్ జనవరి 15న ప్రారంభించారు. NEET PG ప్రతి సంవత్సరం మాస్టర్ ఆఫ్ సర్జరీ (MS), డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD), PG డిప్లొమా సీట్ల కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)చే గుర్తింపు పొందిన MBBS డిగ్రీని కలిగి ఉండాలి. NEET PG 2022 అభ్యర్థి తప్పనిసరిగా ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
A #Fake letter claiming that the NEET-PG examination due to take place on 21/05/2022 has been postponed by 6-8 weeks, is in circulation on social media.#PIBFactCheck
▶️No such letter has been issued by the Directorate General of Health Services. pic.twitter.com/b3g7JLoQWh
— PIB Fact Check (@PIBFactCheck) April 19, 2022