
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 33 మల్టీటాస్కింగ్ స్టాఫ్, పంప్ ఆపరేటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, లైఫ్ గార్డ్, కానిస్టేబుల్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. లైఫ్ గార్డ్, పంప్ ఆపరేటర్, కుక్, మసల్చీ, వాటర్ క్యారియర్, స్వీసర్, మోటర్ మెకానిక్, ఎలక్ట్రికల్, ఫ్లంబర్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో సర్టిఫికేట్/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా దేహదారుడ్య ప్రమాణాలు ఉండాలి. ఈ అర్హతలున్నవారు డిసెంబర్ 12, 19 తేదీల్లో నిర్వహించే ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌కు నేరుగా హాజరుకావచ్చు. అనంతరం ఎంపికై వారికి రాత పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు, 100 మార్కుల చొప్పున, 2 గంటల సమయంలో రాత పరీక్ష ఉంటుంది. జనరల్ నాలెడ్జ్/జనరల్ అవేర్‌నెస్, మ్యథమెటిక్స్, జనరల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ విభాగాల్లో.. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున ప్రశ్నాపత్రంలో వస్తాయి.
North Eastern Police Academy, Umsaw, Distt-Ri-Bhoi, Meghalaya. Pin-793123.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.