IIT Recruitment 2021: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 95 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా డిప్యూటీ రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెంటెండ్, జూనియర్ టెక్నీషియన్స్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్, బీఎస్సీ, సంబంధిత సబ్జెక్టులలో బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
* సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
* పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయసు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష/ సెమినార్ ప్రజంటేషన్ / స్కిల్ టెస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ సెక్షన్, రూ నెం 224, రెండో అంతస్తు (ఫ్యాకల్టీ బిల్డింగ్), ఐఐటీ కాన్పూర్ (యూపీ), 208016.
* దరఖాస్తుల స్వీకరణ రేపటితో (16.11.2021) ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Amala Paul: అదరగొట్టే అందాలతో ఫాన్స్ ని ఫిదా చేస్తున్న అమలా పాల్ లేటెస్ట్ స్టిల్స్..
ఇకపై చంద్రుడి మీద డుగ్గు.. డుగ్గు..నాసా స్పెషల్ బుల్లెట్టు బండి.. వీడియో
ఇకపై చంద్రుడి మీద డుగ్గు.. డుగ్గు..నాసా స్పెషల్ బుల్లెట్టు బండి.. వీడియో