AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Engineering Fee: ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సులకు ఫీజు పెంపు లేనట్లే..! కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ విద్యకు పాత ఫీజులనే ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పాత ఫీజులే ఈ ఏడాదికి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-28 ఫీజుల ఖరారు చేసేందుకు త్వరలోనే..

Engineering Fee: ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సులకు ఫీజు పెంపు లేనట్లే..! కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
Engineering Fee Structure
Srilakshmi C
|

Updated on: Jul 01, 2025 | 3:13 PM

Share

హైదరాబాద్‌, జులై 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ విద్యకు పాత ఫీజులనే ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పాత ఫీజులే ఈ ఏడాదికి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-28 ఫీజుల ఖరారు చేసేందుకు త్వరలోనే అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని, అప్పటివరకు పాత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకోసారి సాధారణంగా ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజులను పెంచడం రివాజుగా వస్తుంది. ఈ ఏడాది ఫీజుల పెంపుపై ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కూడా. అయితే హేతుబద్ధంగా ఫీజుల పెంపును సిఫార్సు చేయడం కోసం రేవంత్‌ సర్కార్‌ ఓ కమిటీని నియమించనుంది.

ఆ కమిటీ తుది నివేదిక ఇచ్చేంతవరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులనే ఈ విద్యా సంవత్సరానికి కూడా కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ కాలేజీల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీ ఆర్క్, ఎంఆర్క్‌లతో పాటు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా డి, ఫార్మా డి(పీబీ), ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్, బీ వొకేషనల్‌ తదితర కోర్సులన్నింటికీ పాత ఫీజులే కొనసాగుతాయని పేర్కొంటూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

తాజా ఉత్తర్వుల మేరకు 2022 – 25 నాటి ఫీజులనే ఈ ఏడాది అమలు అవుతాయని తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఫీజులను పరిశీలించి నివేదిక సమర్పించిన తర్వాత ఫీజులపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపింది. దీనితోపాటు కోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల పెంపుపై నిర్ణయం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిటీ సమీక్ష జరిగే వరకు, ప్రస్తుత ఫీజు నిర్మాణం అమలులో ఉండనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో