AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Stipend Hiked: మెడికల్‌ విద్యార్ధులకు తీపి కబురు.. భారీగా స్టైపెండ్‌ పెంపు! సర్కార్ ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలోని యూజీ, పీజీ మెడికల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్ధులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. మెడికల్‌ విద్యార్ధుల స్టైపెండ్‌ భారీగా పెంచుతూ ప్రకటన జారీ చేసింది. మెడికల్‌ విద్యార్ధుల స్టైపెండ్‌ను దాదాపు 15 శాతం పెంచింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు జీవో విడుదల చేసింది..

Medical Stipend Hiked: మెడికల్‌ విద్యార్ధులకు తీపి కబురు.. భారీగా స్టైపెండ్‌ పెంపు! సర్కార్ ఉత్తర్వులు జారీ
Medical Students
Srilakshmi C
|

Updated on: Jun 30, 2025 | 5:50 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 30: తెలంగాణ రాష్ట్రంలోని యూజీ, పీజీ మెడికల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్ధులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. మెడికల్‌ విద్యార్ధుల స్టైపెండ్‌ భారీగా పెంచుతూ ప్రకటన జారీ చేసింది. మెడికల్‌ విద్యార్ధుల స్టైపెండ్‌ను దాదాపు 15 శాతం పెంచింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు జీవో విడుదల చేసింది. పెంచిన స్టైపెండ్‌లు హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు, సూపర్-స్పెషాలిటీ మెడికల్, డెంటల్ ట్రైనీలు, సీనియర్ రెసిడెంట్‌లకు అందించనున్నట్లు తెలిపింది. పెరిగిన స్టైపెండ్ జనవరి 1, 2025 నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో డెంటల్, ఎంబీబీఎస్, మాస్టర్స్ ఇన్ డెంటల్ సర్జరీ (MDS)లో సూపర్ స్పెషాలిటీ చేస్తున్న డాక్టర్లు ప్రయోజనం పొందనున్నారు.

తాజా ప్రకటన ప్రకారం.. హౌస్ సర్జన్లకు (మెడికల్/డెంటల్ రెండూ) నెలవారీ స్టైఫండ్ గతంలో రూ. 25,906 ఉంటే అది రూ. 29,792కు పెరుగుతుంది. పీజీ (డిగ్రీ) మొదటి సంవత్సరం వైద్యులకు స్టైఫండ్ రూ. 67,032, రెండవ సంవత్సరం రూ. 70,757, మూడవ సంవత్సరం రూ. 74,482లకు పెరిగింది. పీజీ (డిప్లొమా) మొదటి సంవత్సరం వైద్యులకు స్టైఫండ్ రూ. 67,032, రెండవ సంవత్సరం రూ. 70,757కు పెరిగింది.

మొదటి సంవత్సరం సూపర్-స్పెషాలిటీ వైద్యులకు రూ. 1,06,461, రెండవ సంవత్సరం రూ. 1,11,785, మూడవ సంవత్సరం రూ. 1,17,103 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. సూపర్-స్పెషాలిటీ MDS డెంటల్‌ వైద్యులకు మొదటి సంవత్సరం స్టైఫండ్ రూ. 67,032, రెండవ సంవత్సరం రూ. 70,757, మూడవ సంవత్సరం రూ. 74,482 చొప్పున చెల్లిస్తారు. అలాగే సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనం రూ. 1,06,461కు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం (జూన్ 29) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..