Upper age limit for appearing in the National Eligibility cum Entrance Test (NEET UG) 2022 has been removed: నీట్ యూజీ 2022కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షకు (NEET UG) గరిష్ఠ వయోపరిమితిని రద్దు చేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) బుధవారం (మార్చి 9) ప్రకటించింది. గత ఏడాది (2021) అక్టోబర్ 21న జరిగిన నాల్గవ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ వైద్య కమిషన్ సెక్రెటరీ డాక్టర్ పుల్కేశ్ కుమార్ తెలిపారు. కాగా నీట్‌పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు తప్పనిసరిగా పరీక్ష తేదీనాటికి జనరల్ కేటగిరి అభ్యర్ధులకైతే 25 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు 30ఏళ్ల వయోపరిమితి (Age Limit) ఉండాలనే నిబంధన ఇప్పటివరకూ కొనసాగింది. ఇక తాజా నిర్ణయంతో ఈ నిబంధన రద్దు అయ్యింది. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సురేష్ చంద్ర శర్మ ఆమోదం తెలపడంతో నీట్ యూజీ వయోపరిమితిని అధికారికంగా రద్దు చేస్తున్నట్ల ప్రకటిస్తున్నామని సెక్రటరీ డాక్టర్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం ఔత్సాహిక వైద్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, మన దేశంలో వైద్య విద్యను బలోపేతం చేయడంలో మరింత సహాయపడుతుంది ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. నీట్ అనేది మన దేశంలోని వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష. ఆ పరీక్షను ప్రతీఏట దేశవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ ఏడాది (2022) నీట్ యూజీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను NTA ఇంకా ప్రకటించలేదు. గతేడాది సెప్టెంబర్ 12న నీట్ యూజీ దేశవ్యాప్తంగా 13 భాషల్లో జరిగింది.
Good news for the aspirants of NEET-UG!
The National Medical Commission removes the fixed upper age limit for appearing in the NEET-UG examination.
The decision will immensely benefit aspiring doctors and further help in strengthening medical education in the country.
— Office of Dr Mansukh Mandaviya (@OfficeOf_MM) March 9, 2022
Also Read: