NLSIU Recruitment 2022: నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

|

Nov 21, 2022 | 3:54 PM

బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ.. శాశ్వత ప్రాతిపదికన 11 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సోషల్ సైన్సెస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

NLSIU Recruitment 2022: నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
NLSIU Bangalore Recruitment 2022
Follow us on

బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ.. శాశ్వత ప్రాతిపదికన 11 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సోషల్ సైన్సెస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోషియాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో త్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. అలాగే ఐసీఎస్‌ఎస్‌ఆర్‌/యూజీసీ నెట్‌/సీఎస్‌ఐఆర్‌/స్టెట్‌/సెట్‌లో వ్యాలిడ్‌ ర్యాంక్‌ ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్‌ 21, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.