కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తమిళనాడు రాష్ట్రంలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ).. 103 నర్స్, పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ/ హెచ్‌ఎస్‌సీ/ 12వ తరగతి/ బ్యాచిలర్ డిగ్రీ/ బీఎస్సీ/ బీఎన్‌టీ/ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు 55 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 1, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.486, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీలకు చెందినవారు రూ.236లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.25,000ల నుంచి రూ.34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.