AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్థానిక మహిళలకు సర్కార్ కొలువులు.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు! ఇంటర్ పాస్ అయితే చాలు..

రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా పరిధిలోని ఆర్మూర్‌, భీమ్‌గల్‌, బోధన్‌, డిచ్‌పల్లి, నిజామాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్‌, హెల్పర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న 15,982 అంగన్వాడీ నియామకాల ప్రక్రియలో భాగంగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు..

స్థానిక మహిళలకు సర్కార్ కొలువులు.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు! ఇంటర్ పాస్ అయితే చాలు..
Nizamabad Anganwadi Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 09, 2026 | 2:46 PM

Share

తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వమోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని నిజామాబాద్‌ జిల్లాలో 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్‌, అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 179 అంగన్వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలోని ఆర్మూర్‌, బీమ్‌గల్‌, బోదన్‌, డిచ్‌పల్లి, నిజామాబాద్‌ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా మొత్తం 15,982 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో జిల్లా పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే 8 జిల్లాల్లో పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

నిజామాబాద్‌ జిల్లాలో అంగన్వాడీ టీచర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో అర్హత కలిగి ఉండాలి. ఇంటర్‌ అభ్యర్థులు ఎవరూ అందుబాటులో లేనట్లయితే పదోతరగతి పాసైన వారిని ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 27, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు. ఎంపిక ప్రక్రియ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులోఇంటర్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన వారికి జులై 28 నుంచి మే 8, 2026వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది.

నిజామాబాద్‌ జిల్లాలో అంగన్వాడీ టీచర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us