NITTT 2025 Exam Dates: ఎన్‌ఐటీటీటీ 2025 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. పరీక్ష తేదీలివే!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ (NITTT) పరీక్ష 2025 పరీక్ష షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు ఇప్పటికే విడులవగా.. పరీక్షలు మార్చి 22 నుంచి జగరనున్నాయి. రోజుకు రెండు షిఫ్ట్‌లో చొప్పున ఈ పరీక్షలు జరగనున్నాయి..

NITTT 2025 Exam Dates: ఎన్‌ఐటీటీటీ 2025 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. పరీక్ష తేదీలివే!
NITTT 2025 Exam

Updated on: Mar 17, 2025 | 6:47 AM

న్యూఢిల్లీ, మార్చి 17: నేషనల్ ఇనిషియేటివ్ ఫర్‌ టెక్నికల్ టీచర్స్‌ ట్రైనింగ్ (NITTT)-2025 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల విభాగం (ఎన్‌టీఏ) తాజాగా పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలు మార్చి 22, 23, 29, 30వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఎన్‌ఐటీటీటీ-2025 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణలో మరో 212 కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య షురూ..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీలు) ఇంటర్మీడియట్‌ వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశంలో కేంద్ర విద్యాశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమగ్ర శిక్షా కింద రాష్ట్రానికి కేంద్రం వచ్చే రూ.1,600 కోట్ల నిధులను మంజూరు చేయనుంది. అందులో కేంద్ర, రాష్ట్రాల వాటా 60:40గా ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 495 కేజీబీవీలు ఉన్నాయి. అందులో 283 కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్య అందిస్తున్నారు. మిగిలిన 212 కేజీబీవీల్లో ఇంటర్‌ వరకు విద్యను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు కేంద్ర అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.