NIRF Rankings: టాప్‌10లో రెండో స్థానం సాధించిన జవహార్‌లాల్‌ నెహ్రూ వర్సిటీ.. తొమ్మిదో స్థానంలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ..

|

Sep 10, 2021 | 9:00 PM

NIRF Rankings: నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2021లో దేశంలో ఉత్తమ విశ్వవిద్యాలయాల ప్రకటన చేసింది. ఇందులో జవహర్‌లాల్

NIRF Rankings: టాప్‌10లో రెండో స్థానం సాధించిన జవహార్‌లాల్‌ నెహ్రూ వర్సిటీ.. తొమ్మిదో స్థానంలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ..
Jnu
Follow us on

NIRF Rankings: నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2021లో దేశంలో ఉత్తమ విశ్వవిద్యాలయాల ప్రకటన చేసింది. ఇందులో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలవగా, జామియా మిలియా ఇస్లామియా ఆరో స్థానంలో నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ (DU) 12 వ స్థానంలో నిలిచింది. గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ 16 పాయింట్లు మెరుగుపడింది. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ ఈ సంవత్సరం 45 వ స్థానం నుంచి 42 వ స్థానానికి మెరుగుపడింది.

మొత్తం సంస్థల కేటగిరీలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ర్యాంకింగ్‌లో తొమ్మిదో స్థానాన్ని పొందగా జామియా మిలియా ఇస్లామియా 13 వ స్థానాన్ని, ఢిల్లీ విశ్వవిద్యాలయం 19 వ స్థానాన్ని పొందాయి. వైద్య సంస్థల విభాగంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. కాలేజీల కేటగిరీలో మిరాండా హౌస్, న్యూఢిల్లీ మొదటి స్థానం, లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ రెండో స్థానం, సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ఎనిమిదవ స్థానం పొందాయి.

ఇవి టాప్ 10 యూనివర్సిటీలు

1. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, కర్ణాటక – 82.67
2. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ – 67.99
3. బెనారస్ హిందూ యూనివర్సిటీ, బెనారస్, UP – 64.02
4. కలకత్తా విశ్వవిద్యాలయం, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ – 62.06
5. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్, తమిళనాడు – 61.23
6. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ – 60.74
7. ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్, కర్ణాటక మణిపాల్ అకాడమి – 60.58
8. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం, కోలకతా, వెస్ట్ బెంగాల్ – 60,339
9. హైదరాబాద్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలంగాణ – 59.71
10. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్, UP – 58.97

NIRF అంటే ఏమిటి?
నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) పనితీరు ఆధారంగా దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను ర్యాంక్ జారీ చేస్తుంది. NIRF ర్యాంకింగ్ 2015 లో ప్రారంభించారు.

AP Weather Report: రాగల 24 గంటల్లో ఏపీలో మరో అల్పపీడనం..! 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం..

Asteroids: భూమికి అతి దగ్గరగా వచ్చిన 1000వ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా..

Rare statue: గుప్త నిధుల కోసం దుండగుల వేట.. బయటపడ్డ అరుదైన మూషికా విగ్రహం.. ఇంతకీ ఏంచేశారంటే..?