NIRDPR Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. బీటెక్‌, ఎంటెక్‌ చేసిన వారు అర్హులు..

|

Jul 24, 2022 | 8:41 AM

NIRDPR Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్, సెంటర్ ఫర్ జియో-ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్...

NIRDPR Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. బీటెక్‌, ఎంటెక్‌ చేసిన వారు అర్హులు..
Follow us on

NIRDPR Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్, సెంటర్ ఫర్ జియో-ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ (NIRDPR) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని విభాగాలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్(వెబ్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్‌, సర్వీసెస్‌) (6), ప్రాజెక్ట్ సైంటిస్ట్(సిస్టమ్స్ అండ్ నెట్‌వర్క్స్ మేనేజ్‌మెంట్) (2), ప్రాజెక్ట్ సైంటిస్ట్(మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్) (02), ప్రాజెక్ట్ సైంటిస్ట్(జీఐఎస్‌ అనాలిసిస్‌) (6) ప్రాజెక్ట్ సైంటిస్ట్(రిమోట్ సెన్సింగ్ బేస్‌డ్‌ అనాలిసిస్‌) (6) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/ బీటెక్ (సీఎస్‌ఈ/ ఐటీ/ ఈసీఈ/ ఎలక్ట్రానిక్స్‌), ఎంటెక్(జియో-ఇన్ఫర్మేటిక్స్/ జియోమాటిక్స్/ రిమోట్ సెన్సింగ్‌), ఎంఎస్సీ (అగ్రికల్చరల్ సైన్సెస్/ ఫారెస్ట్రీ/ జాగ్రఫీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్/ సీఎస్‌సీ/ ఐటీ/ ఈసీఈ/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్‌) విభాగాల్లో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్‌థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 జీతంగా అందిస్తారు.

* దరఖాస్తు చేసుకునే వారు రూ. 300 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 16-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..