NIMS Recruitment: హైదరాబాద్‌ నిమ్స్‌ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే చివరి తేదీ.. రూ. లక్ష జీతం పొందే అవకాశం.

|

Dec 17, 2022 | 6:50 AM

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ పంజాగుట్టలోని వైద్య సంస్థలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంపలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

NIMS Recruitment: హైదరాబాద్‌ నిమ్స్‌ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే చివరి తేదీ.. రూ. లక్ష జీతం పొందే అవకాశం.
Nims Jobs
Follow us on

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ పంజాగుట్టలోని వైద్య సంస్థలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంపలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అనస్థీషియాలజీ, బయోకెమిస్టీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మెడికల్ జెనెటిక్స్, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 17-12-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..