NIHFW New Delhi Jobs: రాత పరీక్షలేకుండా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.లక్షన్నర జీతం పొందే అవకాశం ..

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్.. ఒప్పంద ప్రాతిపదికన 17 ఫైనాన్స్/అకౌంట్స్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ తదితర భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NIHFW New Delhi Jobs: రాత పరీక్షలేకుండా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.లక్షన్నర జీతం పొందే అవకాశం ..
NIHFW New Delhi

Updated on: Dec 05, 2022 | 4:36 PM

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్.. ఒప్పంద ప్రాతిపదికన 17 ఫైనాన్స్/అకౌంట్స్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ తదితర భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/బీఏ/బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీఈ/బీటెక్‌/ ఐటీ/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్ 23, 2022వ తేది సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

The National Institute of Health & Family Welfare Baba Gang Nath Marg, Munirka, New Delhi-110067.

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు..

  • ఫైనాన్స్/ అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు: 1 పోస్టు
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • స్టోర్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు: 1
  • క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు: 1
  • డేటా అనలిటిక్స్ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు: 1
  • ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్ పోస్టులు: 1
  • ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు: 1
  • సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు: 2
  • డెవలప్‌మెంట్‌ ఆపరేషన్స్‌ డెవలపర్ పోస్టులు: 2
  • డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 2
  • మొబైల్ అప్లికేషన్ డెవలపర్ పోస్టులు: 1
  • సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పోస్టులు: 1

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.