NIFT releases result for UG, PG entrance exam 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు బుధవారం (మార్చి 9) విడుదలయ్యాయి. గత నెల్లో (ఫిబ్రవరి) 6న ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nift.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్ 2 నుంచి 5 వరకు జరిగే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des) ప్రోగ్రామ్‌కు సంబంధించిన సిట్యుయేషన్ టెస్ట్‌లో పాల్గొనవచ్చు. అందుకు మార్చి 11లోపు niftadmissions.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఎంపికలను పూరించవల్సి వుంటుంది. మార్చి 16 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా NIFT 6 బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (BDes) ప్రోగ్రామ్‌ల (యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, లెదర్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్ కోర్సులు)లో ప్రవేశాలకు ఈ పరీక్షను ప్రతి ఏడాది నిర్వహిస్తోంది. వీటితోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (BFTech), 3 మాస్టర్స్ ప్రోగ్రామ్‌ల (మాస్టర్ ఆఫ్ డిజైన్ (MDes), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (MFM), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (MFTech))ను కూడా అందిస్తోంది.
Also Read: