NHPC Recruitment 2021: ఎన్‌హెచ్‌పీసీలో ఉద్యోగాలు.. వేతనం రూ.లక్షపైనే.. పూర్తి వివరాలు..!

|

Sep 16, 2021 | 8:57 AM

NHPC Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సెక్టర్లలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను..

NHPC Recruitment 2021: ఎన్‌హెచ్‌పీసీలో ఉద్యోగాలు.. వేతనం రూ.లక్షపైనే.. పూర్తి వివరాలు..!
Follow us on

NHPC Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సెక్టర్లలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్స్‌ విడుదల చేస్తున్నాయి. ఇక నేష‌న‌ల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప‌వ‌ర్‌(National Hydro Electric Power Corporation Pvt Ltd)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, సీనియర్ అకౌంటెంట్ మరియు అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ ఖాళీలు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు దేశంలో ప‌లు ప్రాంతాల్లో ఉద్యోగం నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల అర్హత‌లు, అనుభవం ఆధారంగా వేత‌నం రూ.1,80,000 ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు ఆఖ‌రు తేదీ సెప్టెంబర్‌30.

అర్హతలు.. ఖాళీలు:

సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ – 13
అసిస్టెంట్ రాజ్‌భాషా అధికారి: 7
జూనియర్‌ ఇంజనీర్‌ (సివిల్‌): 68
జూనియర్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌): 34
జూనియర్‌ ఇంజనీర్‌ (మెకానికల్‌): 31
సీనియర్‌ అకౌంటెంట్‌: 20

సీనియర్ మెడికల్ ఆఫీసర్: ఎంబీబీఎస్‌ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే పోస్టు రిజిస్ట్రేషన్‌తో పాటు రెండేళ్ల పోస్ట్ ఇంటర్న్‌షిప్ అర్హత ఉండాలి. వయసు 33. వేతనం రూ. 60,000 నుంచి 1,80,000 వరకు ఉండవచ్చు.

అసిస్టెంట్ రాజ్‌భాషా అధికారి: హిందీలో గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ స్థాయిలో హింది ఎంపిక చేసుకున్న స‌బ్జెక్టుగా ఉండాలి. అంతే కాకుండా ఏదైన గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ క‌లిగి ఉండాలి. వయసు 35ఏళ్లు. వేతనం జీతం: రూ .40,000 నుంచి 1,40,000 వరకు.

జూనియర్ ఇంజనీర్ (సివిల్): కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. రెగ్యులర్ డిప్లొమా క‌లిగి ఉండాలి. ఆటో-క్యాడ్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు అదనపు ప్రయోజనం పొందుతారు. వయసు 30 ఏళ్లు. వేతనం రూ.29,600 నుంచి 1,19,500 వరకు

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పూర్తి చేసి ఉండాలి. ఆటో-క్యాడ్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు అదనపు ప్రయోజనం పొందుతారు. వయసు 30 ఏళ్లు. వేతనం రూ.29,600 నుంచి 1,19,500 వరకు.

జూనియర్ ఇంజనీర్ (మెకానికల్): కనీసం 60శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పూర్తి చేసి ఉండాలి. ఆటో-క్యాడ్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు అదనపు ప్రయోజనం పొందుతారు. వయసు 30 ఏళ్లు. వేతనం రూ.29,600 నుండి 1,19,500 వరకు.

సీనియర్ అకౌంటెంట్: ఇంటర్మీడియట్ సీఏ, లేదా సీఎంఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయసు 30 ఏళ్లు. వేతనం రూ.29,600 నుంచి రూ.1,19,500 వరకు.

దరఖాస్తులు:

-‍ ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 30 సెప్టెంబర్ 2021 లోపు సమర్పించాలి.
– జనరల్, OBC మరియు GEN-EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా తిరిగి చెల్లించలేని రుసుము 250 చెల్లించాల్సి ఉంటుంది.
– ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ,Ex-Serviceman కేటగిరీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
– దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తులను సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్ ద్వారా వివరంగా వెళ్లాలి.

నోటిఫికేషన్:  పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

DOST Admission 2021: డిగ్రీలో చేరేందుకు మరో ఛాన్స్.. దోస్త్‌ మూడో విడుత గడువు పొడగింపు..

CUCET Admit Card 2021: సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి..