NEET UG Results 2022: నీట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. నేడే ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

NEET UG Results 2022: నీట్‌ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్‌. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NEET) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎమ్‌బీబీఎస్‌ (MBBS) సీట్ల ఎంట్రన్స్‌ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను...

NEET UG Results 2022: నీట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. నేడే ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
Neet Exam Results

Updated on: Sep 07, 2022 | 6:30 AM

NEET UG Results 2022: నీట్‌ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్‌. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NEET) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎమ్‌బీబీఎస్‌ (MBBS) సీట్ల ఎంట్రన్స్‌ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. neet.nta.nic.in రిజల్ట్స్‌తో పాటు ఫైనల్‌ ఆన్సర్‌ కీ, మెరిట్‌ జాబితాను కూడా ఈరోజే విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలలో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీ చేయడానికి నీటీ యూజీ 2002ను గత జులై 17వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల చేసుకున్న విద్యార్థుల్లో 95 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. దేశంలోని 497 నగరాల్లోని 3750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్‌ పరీక్షకు మొత్తం 18,72,343 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ neet.nta.nic.inలోకి వెళ్లాలి. అనతంరం హోమ్‌ పేజీలో ఉన్న నీట్ యూజీ స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్ క్లిక్ చేయాలి. అక్కడ మీ లాగిన్ డీటైల్స్ ఇచ్చి పలితాలను చెక్ చేసుకోవాలి. ఇదిలా ఉంటే నీట్‌ మెడికల్‌ ప్రవేశ పరీక్ష కోసం చేసుకున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య 18 లక్షలకు అధిగమించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..