
హైదరాబాద్, జూన్ 14: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు శనివారం (జూన్ 14) విడుదల కానున్నాయి. ఈ ఏడాది మే 4వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్-యూజీ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో పెన్ను-పేపర్ విధానంలో 557 నగరాలు, 14 అంతర్జాతీయ నగరాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 5,453 పరీక్ష కేంద్రాలను ఈ పరీక్ష కోసం కేటాయించారు. ఈ పరీక్షకు 22.7 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. నీట్ యూజీ ఫైనల్ ‘కీ’తోపాటు ఫలితాలను ఈ రోజు వెల్లడించే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ఫలితాల వెల్లడి అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నేడు నీట్ యూజీ ఫలితాల విడుదల నేపథ్యంలో కటాఫ్ అందరి దృష్టి నిలిచింది. 2014లో జనరల్ కేటగిరీకి 720-162, జనరల్ పీహెచ్ 161-144, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు 161-127, ఎస్సీ/ఓబీసీ పీహెచ్‌కు 143-12, ఎస్టీ పీహెచ్‌కు 142-127గా నిర్ణయించారు. అయితే ఈ ఏడాది కటాఫ్ మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత కఠినంగా నీట్ యూజీ క్వశ్చన్ పేపర్‌ను రూపొందించారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్ధులతోపాటు నిపుణులు సైతం ఈ విషయాన్ని ఇప్పటికే వెల్లడించారు. కొందరు విద్యార్ధులైతే కనీసం అర్హత మార్కులైనా వస్తాయో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి జనరల్ కేటగిరీకి 623-535 మధ్యలో కటాఫ్ ఉండే అవకాశం ఉంది. ఓబీసీకి 570-510, ఎస్సీ/ఎస్టీకి 405-332 మధ్య ఉండే అవకాం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.