NEET UG 2024 Results: ఈ వారంలోనే నీట్‌ యూజీ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే!

|

May 28, 2024 | 2:12 PM

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2024) పరీక్ష మే 5వ తేదీన 571 కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంంగా దాదాపు 23 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు ఉండగా.. 13 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. 3 గంటల 20 నిమిషాల వ్యవధిలో..

NEET UG 2024 Results: ఈ వారంలోనే నీట్‌ యూజీ ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే!
NEET UG 2024 Results
Follow us on

న్యూఢిల్లీ, మే 28: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2024) పరీక్ష మే 5వ తేదీన 571 కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంంగా దాదాపు 23 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు ఉండగా.. 13 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. 3 గంటల 20 నిమిషాల వ్యవధిలో పరీక్ష జరిగింది.

ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాల త్వరలోనే వెల్లడించేందుకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఈ వారంలో ప్రిలిమినరీ కీ విడుదల చేసి, వెనువెంటనే అభ్యంతరాలను కూడా స్వీకరించనుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ ఆన్సర్‌ కీ రూపొందించి, జూన్‌ 14న ఫలితాలతో పాటు తుది ఆన్సర్‌ కీ కూడా విడుదల చేయనుంది.

నీట్‌ యూజీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్‌(MBBS), బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు యేటా 20 లక్షలకు పైగా విద్యార్ధులు పోటీ పడుతుంటారు.

నీట్‌ యూజీ 2024 ఫలితాల అనంతరం ర్యాంక్‌ కార్డు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.