NEET UG 2022: నీట్ యూజీ 2022 ఎగ్జాం సిటీ స్లిప్‌ విడుదల.. త్వరలోనే అడ్మిట్‌ కార్డులు..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (NEET) యూజీ-2022 పరీక్షకు సంబంధించి సిటీ అలాట్‌మెంట్‌ స్లిప్‌లను నేషనల్ టెస్టింట్‌ ఏజెన్సీ ఈ రోజు (జూన్‌ 29) విడుదల చేసింది..

NEET UG 2022: నీట్ యూజీ 2022 ఎగ్జాం సిటీ స్లిప్‌ విడుదల.. త్వరలోనే అడ్మిట్‌ కార్డులు..
Exam City Slip

Updated on: Jun 29, 2022 | 3:31 PM

NEET UG 2022 Exam City slip Download: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (NEET) యూజీ-2022 పరీక్షకు సంబంధించి సిటీ అలాట్‌మెంట్‌ స్లిప్‌లను నేషనల్ టెస్టింట్‌ ఏజెన్సీ ఈ రోజు (జూన్‌ 29) విడుదల చేసింది. ఇంటిమేషన్‌ స్లిప్‌లో నీట్ యూజీ 2022 పరీక్ష కేంద్రంగా ఏ సిటీని కేటాయించారన్న విషయం మాత్రమే ఉంటుంది. పరీక్ష కేంద్రం, వెన్యూ వంటి ఇతర వివరాలు అడ్మిట్‌ కార్డులో ఉంటాయి. విద్యార్ధులు ఈ తేడాను గమనించగాలని సూచించింది. నేడు విడుదలైన ఎగ్జాం సిటీ అలాట్‌మెంట్‌ స్లిప్‌లను నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ eet.nta.nic.in. నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదు చేసి గ్జాం సిటీ అలాట్‌మెంట్‌ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. నీట్ యూజీ పరీక్ష తేదీలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదని, ముందుగా నిర్ణయించిన ప్రకారంగానే యథాతథంగానే జులై 17న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో, 13 భాషల్లో జరగనుందని ఈ సందర్భంగా ఎన్టీఏ స్పష్టం చేసింది.

కాగా ఈ ఏడాది నీట్‌ యూజీ పరీక్షకు దాదాపు18.72 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 10.64 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం. 8.07 మంది పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 771 మంది విదేశీయులు, 910 మంది ప్రవాస భారతీయులు, 647 మంది ఓవర్‌సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా కార్డు హోల్డర్లు కూడా ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఇంగ్లిష్‌ను పరీక్ష మాధ్యమంగా ఎంచుకోగా.. తర్వాత హిందీ, తమిళం ఉన్నాయి. గత ఏడాది నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష సెప్టెంబర్‌ 12వ తేదీన జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 95 శాతం (15.44 లక్షలు) మంది పరీక్షకు హాజరయ్యారు. 3,858 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. దాదాపు 8.70 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.