NEET UG 2022 correction window opened: నీట్ యూజీ (NEET UG 2022) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరెక్షన్ విండో ఓపెన్ అయినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం (మే 24) ప్రకటించింది. మే 24 నుంచి మే 27 వరకు కరెక్షన్ విండో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసింది. నీట్ యూజీ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, దరఖాస్తు సమయంలో ఏవైనా పొరపాట్లు చేసిఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మే 27 తర్వత వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఉండదు. ఐతే వివరాలను సరిదిద్దుకోవడానికి ముందు అభ్యర్థులు ఆన్‌లైన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. కాగా నీట్ యూజీ 2022 ప్రవేశ పరీక్ష జులై 17 (ఆదివారం)న దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ పద్దతిలో (పెన్-పేపర్) పలు పరీక్ష కేంద్రాల్లో 13 భాషల్లో జరగనుంది. ఈ పరీక్ష 200 ప్రశ్నలకు 200 నిముషాలపాటు కొనసాగుతుంది.
NEET UG 2022 కరెక్షన్ ఎలా చేయాలంటే..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.