NEET-PG 2023 exam date: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG 2022) పీజీ 2023 ప్రవేశ పరీక్ష జనవరి 23 తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. ఐతే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) మాత్రం ఇంకా అధికారికంగా పరీక్ష తేదీని ప్రకటించలేదు. అధికారికంగా వచ్చే నెలలో ప్రకటన వెలువడుతుంది. ఏడాది మొదట్లోనే పరీక్ష తేదీని ప్రకటిస్తే నీట్ అడ్మిషన్ ప్రక్రియ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా గత రెండేళ్లుగా కరోనా కారణంగా నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ప్రక్రియలు సకాలంలో నిర్వహించలేకపోయిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి నీట్ పరీక్ష ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఎన్‌బీసీ అధికారులు భావిస్తున్నారు.
దీంతో వచ్చే యేడాది నీట్ పీజీ 2023 పరీక్ష తేదీని తాత్కాలికంగా వెలువరించింది. నీట్ పీజీ పరీక్షల ఫార్మాట్‌ను మార్చబోతున్నారనే ఊహాగానాలు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఐతే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంతవరకూ ఎమ్‌సీసీ ప్రకటించలేదు. పాత ఫార్మాట్ ప్రకారంగానే పరీక్ష జరుగుతుంది. ఇతర పూర్తి సమాచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ natboard.edu.inలో చేసుకోవచ్చు. ఇక NEET PG 2022 సంబంధించి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. స్కోర్ కార్డులను కూడా బోర్డు విడుదల చేసింది. నీట్ పీజీ కౌన్సెలింగ్ హెడ్యూల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కౌన్సెలింగ్ తేదీలపై పని చేస్తోంది. అనంతరం త్వరలోనే దాని అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.