Naval Ship Repair Yard Jobs: నావల్ షిప్ రిపేర్‌యార్డ్‌తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌ల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా కర్ణాటకలోని నావల్ షిప్ రిపేర్‌యార్డ్, గోవాలోని నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌ల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 173 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో నావల్ షిప్ రిపేర్‌యార్డ్, కర్ణాటక (150), నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్, గోవా (23) ఉన్నాయి.
* కార్పెంటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, పెయింటర్, ప్లంబర్, టెయిలర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, కనీసం 65 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల హార్డ్‌కాపీలను ది ఆఫీసర్–ఇంచార్జ్, డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, నావల్‌షిప్ రిపేర్ యార్డ్, నావల్ బేస్, కార్వార్, కర్ణాటక–581308 చిరునామకు పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7700 స్టయిపండ్‌గా అందిస్తారు.
* అభ్యర్థులను అకడమిక్ మార్కుల్లో మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 19-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Constitutional Rights: ప్రతి భారతీయ పౌరునికి రాజ్యాంగం మీకు కల్పించే హక్కుల గురించి తెలుసా..