NHTET 2025 Notification: నేషనల్ హాస్పిటాలిటీ టెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్.. రాత పరీక్ష ఎప్పుడంటే?

National Hospitality Teachers Eligibility Test 2025 Exam Date: నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌హెచ్‌టెట్‌) డిసెంబర్ 2025కు దరఖాస్తులు కోరుతూ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (NCHMCT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను నవంబర్‌ 30, 2025 వరకు స్వీకరిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎన్‌సీహెచ్‌ఎంసీటీ అనుబంధ..

NHTET 2025 Notification: నేషనల్ హాస్పిటాలిటీ టెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్.. రాత పరీక్ష ఎప్పుడంటే?
National Hospitality Teachers Eligibility Test 2025 Exam

Updated on: Nov 04, 2025 | 7:57 AM

నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌హెచ్‌టెట్‌) డిసెంబర్ 2025కు దరఖాస్తులు కోరుతూ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (NCHMCT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను నవంబర్‌ 30, 2025 వరకు స్వీకరిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎన్‌సీహెచ్‌ఎంసీటీ అనుబంధ ఐహెచ్‌ఎంల‌లో లెక్చరర్, టీచింగ్ అసోసియేట్‌గా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌టెట్‌) డిసెంబర్ 2025 పరీక్షను హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ / హోటల్ మేనేజ్‌మెంట్, కలినరీ ఆర్ట్స్ / ఫుడ్ అండ్ బెవరేజ్ స్పెషలైజేషన్‌ విభాగాల్లో నిర్వహిస్తారు.

NCHMCT 2025 దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 55 శాతం మార్కులతో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కలినరీ ఆర్ట్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే రెండేళ్ల హాస్సిటలిటీ ఇండస్ట్రీ పని అనుభవం ఉండాలి. మాస్టర్ చివరి సెమిస్టర్‌లో చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి అసిస్టెంట్‌ లెక్చరర్‌కు 35 ఏళ్లు, టీచింగ్‌ అసోసియేట్‌కు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు రూ.1000, మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.500 చొప్పున చెల్లిస్తారు. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని డైరెక్టర్‌, ఎన్‌సీహెచ్‌ఎంసీటీ, ఏ-34, సెక్టార్‌-62, నోయిడా.. అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌టెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత తరువాత ప్రాక్టికల్‌ స్కిల్‌ టెస్ట్‌, టీచింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. పరీక్ష నోయిడా, చెన్నై, గువహటి, కోల్‌కతా, ముంబయి.. లలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు పేపర్‌1, 2 ఓఎంఆర్‌ విధానంలో జరుగుతుంది. నెగటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్‌ 14, 2025వ తేదీన నిర్వహిస్తారు. అడ్మిట్‌ కార్డులను డిసెంబర్‌ 7 నుంచి 14వ తేదీలోపు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాలు డిసెంబర్‌ 31 లోపు వెల్లడిస్తారు.

ఇవి కూడా చదవండి

నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.