NCSM Recruitment 2021: నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియ‌మ్స్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులంటే..

|

Jun 17, 2021 | 6:16 AM

NCSM Recruitment 2021: నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియ‌మ్స్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కోల్‌క‌తాలో ఉన్న ఈ సంన్థ‌లో మొత్తం 5 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించి...

NCSM Recruitment 2021: నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియ‌మ్స్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులంటే..
Ncsm Jobs
Follow us on

NCSM Recruitment 2021: నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియ‌మ్స్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కోల్‌క‌తాలో ఉన్న ఈ సంన్థ‌లో మొత్తం 5 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ జూన్ 15 నుంచి మొదలైంది. ఈ నేప‌థ్యంలో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం ఐయిదు ఖాళీల‌కు గాను.. ఆఫీస్ అసిస్టెంట్ (1), జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్ (1), టెక్నీషియ‌న్-ఏ (3) ఖాళీల్లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. హెచ్ఎస్సీ లేదా ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌లో నిర్ణీత స్పీడ్‌లో టైప్ చేయ‌గ‌లగాలి. టెక్నీషియ‌న్ పోస్టుల‌కు ప‌దో త‌ర‌గతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 23 ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అప్లికేష‌న్ ఫీజును రూ. 200గా నిర్ణ‌యించారు.

* ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ జూన్ 15న ప్రారంభంకాగా.. చివ‌రితేదీగా జూన్ 28ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం https//www.ncsm.gov.in/recruitment ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

Also Read: AP Govt jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Post Office Jobs: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. అర్హత 10వ తరగతి

SBI SO Recruitment 2021: ఎస్బీఐ ఫైర్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. జూన్ 28 చివరి తేదీ..