మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) 2022-23 విద్యాసంవత్సరానికి గానూ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీల్లో నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. వనపర్తి మహిళా వ్యవసాయ కాలేజీలో 120 సీట్లు, కరీంనగర్ మహిళా వ్యవసాయ కాలేజీలో 120 సీట్ల చొప్పున ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్ స్పెషలైజేషన్‌లో డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్ధుల వయసు తప్పనిసరిగా 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 5, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు సమయంలో రూ.900లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. తెలంగాణలో ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్-2022 లేదా పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్-2022లో సాధించిన ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మెరిట్ లిస్ట్ డిసెంబర్ 10వ తేదీన ప్రకటిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.