Telangana: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. కొత్తగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలు..

|

Aug 25, 2022 | 6:51 PM

Telangana: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బీసీ వర్గానికి చెందిన విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా 33 బీసీ గురుకులాలతో పాటు 15 బీసీ డిగ్రీ కాలేజీల..

Telangana: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. కొత్తగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలు..
Telangana
Follow us on

Telangana: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బీసీ వర్గానికి చెందిన విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా 33 బీసీ గురుకులాలతో పాటు 15 బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. గురువారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌ది విద్యను అందించే విధానం, ప్రతిపక్షాలది విద్వేషం అందించే తీరు. ఇందుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడమే నిదర్శన’మని తెలిపారు. ఇప్పటికే ఉన్న 261 గురుకుల స్కూళ్లకు అధనంగా జిల్లాకొకటి చొప్పున కొత్తగా 33 గురుకులాలను, 15 డిగ్రీ కాలేజీలను బీసీలకు కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది.

దేశ చరిత్రలోనే ఏకకాలంలో 15 డిగ్రీ కాలేజీలను, 33 గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనని మంత్రి అన్నారు. ఇందుకుగాను ముఖ్యమంత్రికి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఏడాది నుంచి ఈ విద్యా సంస్థల్లో 8 రకాల కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. వీటి ద్వారా 1200 మంది విద్యార్థులకు అదనంగా 4800 మంది బీసీ బిడ్డలకు లబ్దీ చేకూరుతుందన్నారు. ఈ విద్యా సంస్థలతో 1,65,160 మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి బోదన అందుతోందని మంత్రి వివరించారు. ఒక్కో బీసీ విద్యార్థిపై రూ. 1,25,000 ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

బీసీ సంక్షేమ గురుకులాల్లో నాణ్యమైన బోజనం, వసతితో పాటు బ్లాంకెట్లు, జాకెట్స్, ట్రాక్ సూట్స్, కిచెన్ యుటెన్సియల్స్ తో పాటు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగాడిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. వానాకాలం, చలికాలంలో స్నానానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చేసిన విజ్ణప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే రూ. 80 కోట్లు మంజూరు చేశారని, ఈ ఏడాదే సోలార్‌ వాటర్‌ హీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..