AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2025: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఇంతకీ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ కూటమి సర్కార్‌ మాత్రం గత ఏడాది జూన్‌ నుంచి అదిగో ఇదిగో అంటూ కాలం సాగదీస్తూనే ఉంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఎప్పటికప్పుడు అధికార ప్రభుత్వం గుర్తు చేస్తుంది..

AP Mega DSC 2025: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఇంతకీ ఏమన్నారంటే?
CM Chandrababu Naidu
Srilakshmi C
|

Updated on: Feb 07, 2025 | 5:06 PM

Share

అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గత ఏడాది జూన్‌ నుంచి కూటమి సర్కార్ ఊరిస్తూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ కాలం సాగదీస్తుంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబుతో పాటు విద్యామంత్రి నారా లోకేష్ కూడా రోజుకో ప్రకటన ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు ఆసక్తికర ప్రకటన చేశారు. కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనాల్లోకి వెళ్లేలా కార్యచరణ రూపొందిచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అలాగే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు.

రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదన్నారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్ని పెట్టుబడులు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అలాగే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేబినెట్‌లో చర్చ జరిపారు. మెనూలో చేసిన మార్పులపై సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కోస పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సన్న బియ్యం తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..