NEET UG PG counselling 2021 Round 2 Revised Schedule: నీట్ యూజీ, పీజీ (NEET UG/PG 2nd Round Counselling) కౌన్సెలింగ్ 2021 తేదీలను సవరించాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) రాష్ట్రాలను ఆదేశించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించి వివిధ విషయాల్లో న్యాయస్థానాల ఆదేశాల మేరకు ప్రతి రౌండ్‌కు యూజీ/పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను పొడిగించాలని తెల్పింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను వెబ్‌సైట్ mcc.nic.inలో చూడొచ్చు. తాజా ప్రకటన ప్రకారం.. ఆల్ ఇండియా కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ప్రతి రౌండ్‌కు రాష్ట్ర కౌన్సెలింగ్ నిర్వహించాలని కమిటీ ఆదేశించింది. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాతనే రాష్ట్ర కౌన్సెలింగ్ తేదీలు వచ్చే విధంగా స్టేట్ కోటా కౌన్సెలింగ్‌కు రాష్ట్రాలు తమ షెడ్యూల్‌లను సవరించాలి పేర్కొంది. ఈ మేరకు ఆల్ ఇండియా యూజీ/పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ నుండి రాష్ట్ర కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సవరించడం గురించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ల నుంచి ప్రాతినిధ్యాలను స్వీకరించిన తర్వాత ఎమ్‌సీసీ నిర్ణయించింది. కాగా DGHS, DME కౌన్సెలింగ్‌ల విషయంలో కొంత గందరగోళ పరిస్థితినెలకొనడంతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా నోటిఫికేషతో NEET PG రౌండ్ 2 కౌన్సెలింగ్ 2021ను ఫిబ్రవరి 14 వరకు పొడిగించడం జరిగింది. పీజీ రౌండ్ 2 కౌన్సెలింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు కొనసాగుతుంది.
Also Read: