Job Mela: ఆన్‌లైన్‌ విధానంలో ఉర్దూ జాబ్‌ మేళా.. ఎలా హాజరు కావాలంటే.. పూర్తి వివరాలు..

|

Feb 01, 2022 | 6:51 PM

Job Mela: కరోనా కారణంగా విద్య సంస్థలు ఎలాగైతే ఆన్‌లైన్‌ విధానంలో బోధన చేపడుతున్నారో. జాబ్‌మేళాలు కూడా ఆన్‌లైన్‌ నిర్వహిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ ఇలాంటి ఆన్‌లైన్‌ ఉర్దూ జాబ్‌ మేళాను నిర్వహిస్తోంది. ఈ జాబ్‌మేళాలో..

Job Mela: ఆన్‌లైన్‌ విధానంలో ఉర్దూ జాబ్‌ మేళా.. ఎలా హాజరు కావాలంటే.. పూర్తి వివరాలు..
Follow us on

Job Mela: కరోనా కారణంగా విద్య సంస్థలు ఎలాగైతే ఆన్‌లైన్‌ విధానంలో బోధన చేపడుతున్నారో. జాబ్‌మేళాలు కూడా ఆన్‌లైన్‌ నిర్వహిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ ఇలాంటి ఆన్‌లైన్‌ ఉర్దూ జాబ్‌ మేళాను నిర్వహిస్తోంది. ఈ జాబ్‌మేళాలో అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని తెలుపుతూ యూనివర్సిటీ అధికారులు ప్రకటన జారీ చేశారు. తెలంగాణలో నిర్వహిస్తున్న తొలి ఉర్దూ జాబ్ మేళా ఇదే కావడం విశేషం.

నిజానికి ఈ జాబ్‌ మేళా జనవరి 6న నిర్వాహించాల్సి ఉండగా కరోనా కేసులు భారీగా పెరిగిన కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ జాబ్‌మేళాను ఫిబ్రవరి 4న ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ విశ్వవిద్యాల‌యం ఇంచార్జి, శిక్షణ, ప్లేస్‌మెంట్ సెల్ డాక్టర్ మహమ్మద్ యూసుఫ్ ఖాన్ జాబ్‌మేళా గురించి మాట్లాడుతూ.. ‘జాబ్ మేళా కోసం రిజిస్టర్ చేసుకున్న వారందరూ వివిధ కంపెనీల వారి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇంటర్వ్యూల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. ఈ జాబ్ మేళాకు హాజరుకావాలనుకుంటోన్న వారు తమ పూర్తి వివరాలతో కూడిన ప్రోఫార్మాను, అండర్‌టేకింగ్‌లను jobmelaurdumanuusetwin@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించాలి’అని తెలిపారు.

ఇందుకు ఫిబ్రవరి 3ను చివరి తేదీగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఈ జాబ్‌మేళాను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మ‌ను) తో క‌లిసి తెలంగాణ స్టేట్ ఉర్దూ అకాడమీ, సెట్విన్ సెక్యూరిటీ అండ్‌ మ్యాన్ పవర్ సర్వీసెస్, హైదరాబాద్ వీకర్ సెక్షన్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహించనున్నారు. మరెందుకు ఆలస్యం ఈ సదవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి.

Also Read: Vault Vastu Rules: గల్లపెట్టెను ఇంట్లో ఎటువైపు పెట్టాలో తెలుసా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..

UP ASSEMBLY POLLS: యుపి అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. యోగి నెత్తిన పాలు పోస్తున్న విపక్షాల ఎత్తుగడలు

Fitness Tips: యోగా చేయడానికి ముందు తర్వాత ఏం తినాలో తెలుసుకోండి..?