BHAROSA-Society Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో మల్కాజిగిరి భరోసా సెంటర్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మల్కాజిగిరిలోని భరోసా సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన లీగల్ సపోర్ట్ ఆఫీసర్..
Malkajgiri BHAROSA-Society Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మల్కాజిగిరిలోని భరోసా సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టుల వివరాలు: లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ పోస్టులు
- లీగల్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎల్ఎల్‌బీ లేదా ఎల్ఎల్ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం పోస్టులకు బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- రిసెప్షనిస్ట్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Cyberabad Commissionerate, Gachibowli
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: