JEE Main 2025 Registration: జేఈఈ మెయిన్‌ చరిత్రలో తొలిసారి భారీగా తగ్గిన దరఖాస్తులు.. కారణం అదేనా?

|

Nov 13, 2024 | 2:34 PM

యేటా భారీగా పోటీపడే జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ సారి దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. అందుకు ఎన్టీయే పెట్టిన కొర్రీలే కారణం అంటున్నారు నిపుణులు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి దరఖాస్తు విధానంలో అదనంగా పలు వివరాలను నమోదు చేయాలని ఎన్టీయే పేర్కొంది. దీంతో తొలి రెండు వారాల్లో..

JEE Main 2025 Registration: జేఈఈ మెయిన్‌ చరిత్రలో తొలిసారి భారీగా తగ్గిన దరఖాస్తులు.. కారణం అదేనా?
JEE Main 2025 Registration
Follow us on

హైదరాబాద్‌, నవంబర్ 12: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2025కు దరఖాస్తు చేసుకునే ప్రక్రయ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో పలు ఇబ్బందులు తలెత్తుతుండటంతో తొలి రెండు వారాల్లో కేవలం 5.10 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది మాత్రం తొలి రెండు వారాల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 12.21 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈసారి దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 28 నుంచే ప్రారంభమైంది. నవంబరు 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా నిర్ణయించారు. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను కేటాయించి, పరీక్షకు 3 రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తుంది.

అయితే 2025 సంవత్సరానికి నిర్వహిస్తున్న తొలివిడత జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డుపై పేరులో తేడాలు ఉండటాన్ని ఎన్టీయే సమస్యగా లేవనెత్తుతుంది. అలాగే రిజర్వేషన్‌ కేటగిరీలోని ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ విద్యార్థులు ఆయా సర్టిఫికెట్లు పొందాలని నిబంధన షరతు విధించింది. ఇలాంటి ఎన్నో వివరాలు ఈసారి కొత్తగా నమోదు చేయాల్సి ఉండటంతో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దరఖాస్తు గడువుకు మరో 10 రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. భారీగా దరఖాస్తులు అందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జనవరి 22 నుంచి 31వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు రెండు షిఫ్టుల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 12వ తేదీన తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఇంగ్లిష్‌, హిందీతోపాటు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.