LIC AAO Recruitment 2023: ఎల్‌ఐసీలో 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం..

|

Jan 16, 2023 | 2:19 PM

భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్ఐసీ).. 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

LIC AAO Recruitment 2023: ఎల్‌ఐసీలో 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం..
LIC AAO Recruitment 2023
Follow us on

భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్ఐసీ).. 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023 నాటికి తప్పనిసరిగా 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1993 నుంచి జనవరి 1, 2002 మధ్య జన్మించిన వారు అర్హులు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్ధులు రూ.700లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.85లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష (ప్రిలిమ్స్/మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌ ఫిబ్రవరి 17, 20 తేదీల్లో జరుగుతుంది. మెయిన్స్‌ రాత పరీక్ష మార్చి18న ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.53,600ల నుంచి రూ.1,02,090ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.