AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?

రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) భారీ నోటిఫికేషన్‌ అందించింది. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 134 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది..

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?
Konkan Railway Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 09, 2026 | 6:39 AM

Share

రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) భారీ నోటిఫికేషన్‌ అందించింది. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 134 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ప్రధానంగా రెండు విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీలను ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ, టెక్నీషియన్/జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టులను అందిస్తుంది. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలతో పాటు జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లకు కూడా అవకాశాలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని.. చివరి తేదీలోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగం (బీఈ/బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, బీఈ/బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, బీఈ/బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా సివిల్, డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్, డిప్లొమా మెకానికల్)లో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ స్ట్రీమ్ పోస్టులకు బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, బిజినెస్ స్టడీస్ తదితర బ్యాచిలర్ డిగ్రీలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 2021, 2022, 2023, 2024, 2025 సంవత్సరాల్లో సంబంధిత విద్యార్హతను పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ అప్రెంటిస్‌షిప్‌కు అర్హులు. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాలు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇస్తారు. ఈ కాలంలో నిబంధనల మేరకు నెలవారీగా స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.12,300, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులకు రూ.10,900 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లూకుండా.. లేకుండా విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఒకే శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఉన్నప్పుడు ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు ఇవే..

  • బీఈ సివిల్, డిప్లొమా సివిల్, బీఈ ఎలక్ట్రానిక్స్ పోస్టులకు: ఆగస్టు 24, 2026.
  • బీఈ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ పోస్టులకు: ఆగస్టు 25, 2026.
  • బీఈ మెకానికల్, డిప్లొమా మెకానికల్ పోస్టులకు: ఆగస్టు 27, 2026.
  • జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ పోస్టులకు: ఆగస్టు 28, 2026.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడ్రస్..

ఎగ్జిక్యూటివ్స్ క్లబ్, కొంకణ్ రైల్ విహార్, సెక్టార్-40, సీవుడ్స్ రైల్వే స్టేషన్ (వెస్ట్) ఎదురుగా, నవీ ముంబయి – 400706.

కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us