Telangana Eamcet 2021: విద్యార్థులు బీ అలెర్ట్.. ఎంసెట్ ప్రశ్నా పత్రంలో కీలక మార్పులు.. ఏం చదవాలో తెలుసా..

|

Mar 07, 2021 | 9:00 PM

Telangana Eamcet 2021: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 18వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.

Telangana Eamcet 2021: విద్యార్థులు బీ అలెర్ట్.. ఎంసెట్ ప్రశ్నా పత్రంలో కీలక మార్పులు.. ఏం చదవాలో తెలుసా..
Follow us on

Telangana Eamcet 2021: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 18వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక జులై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 5వ తేదీన అగ్రికల్చర్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. జులై 6న మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక జులై 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష పెడతారు. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని ఎంసెట్ కన్వీనర్ అలిసేరి గోవర్ధన్ తెలిపారు.

ఇదిలాఉంటే.. ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నుంచే ఎక్కువ ప్రశ్నలు రానున్నాయి. ఎంసెట్- 2021లో 55 శాతం ప్రశ్నలు ఇంటర్ మొదటి ఏడాది సిలబస్ నుంచే ఇవ్వనున్నారు. మొత్తం 160 ప్రశ్నల్లో 88 వస్తాయి. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం నుంచి 45 శాతం అంటే 72 ప్రశ్నలు ఇస్తారు. ఈ మేరకు ఎంసెట్ కమిటీ కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగినట్లుగా ప్రిపేర్ కావాలని కమిటీ సూచించింది.

మరిన్ని చదవండి :

Acharya Movie Shooting : అదిరిపోయే డ్రెస్స్‌లో ఆచార్య.. బొగ్గు గనుల మధ్య పోరాడుతున్న చిరు, రామ్‌చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Gaali Sampath Pre- Release : ‘గాలి సంపత్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రధాన పాత్రలో నటించిన శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్..

కారుణ్య నియామకాలకు పెళ్లైన మహిళలు అర్హులే.. తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..