
ప్రముఖ కేంద్ర విద్యా సంస్థలైన కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 ఏడాదికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదట ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
మార్చి 27న ఉదయం 10 గంటలకు మొదలయ్యే ప్రక్రియ ఏప్రిల్ 17వ తేదీ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఒకటో తేదీలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు నిండాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు బర్త్ సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ తొలి జాబితాను ఏప్రిల్ 20వ తేదీన ప్రకటించనున్నారు. అనంతరం తదుపరి రోజు అంటే ఏప్రిల్ 21వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. సీట్లు మిగిలిపోతే ఖాళీలను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాను ప్రకటించి సీట్లను భర్తీ చేయనున్నారు. ఇక రెండో తరగతతితో పాటు, పై తరగతుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు.. ఏప్రిల్ 3వ తేదీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..