Job Notification: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

| Edited By: Team Veegam

Apr 02, 2021 | 7:48 PM

Job Notification:  గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థుల కోసం అన్నిరకాల సౌకర్యాలతో కూడిన మంచి విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్...

Job Notification: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్!
Job Notification
Follow us on

Job Notification:  గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థుల కోసం అన్నిరకాల సౌకర్యాలతో కూడిన మంచి విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్) ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న పాఠశాలలతో పాటుగా వచ్చే విద్యాసంవత్సరం కొత్తగా కొన్ని పాఠశాలలు ప్రారంభించడానికి కేంద్రం ఏర్పాట్లు మొదలు పెట్టింది.

కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్) లో వివిధ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఈఎంఆర్ఎస్ స్కూళ్ళు నడుస్తున్నాయి. ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 3476 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణాకు సంబంధించి 262, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 117 ఖాళీలు ఉన్నాయి.

వివిధ కేటగిరీలలో ఖాళీల వివరాలు ఇవీ..

  • ప్రిన్సిపల్ 175
  • వైస్ ప్రిన్సిపల్ 116
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 1244
  • ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) 1944

ఇక రాష్ట్రాలవారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.. 

  • ఆంధ్రప్రదేశ్ లోమొత్తం పోస్టులు 117 – ఇందులో ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 6, టీజీటీ 97 ఖాళీలు ఉన్నాయి.
  • తెలంగాణలో మొత్తం పోస్టులు 262 – ఇందులో ప్రిన్సిపల్ 11, వైస్ ప్రిన్సిపల్ 6, టీజీటీ 168, పీజీటీ 77  ఖాళీలు ఉన్నాయి.
  • ఛత్తీస్ గఢ్ లో మొత్తం పోస్టులు 514, గుజరాత్ లో 161, హిమాచల్ ప్రదేశ్ లో 8, జార్ఖండ్ లో 208, జమ్మూ కాశ్మీర్ లో 14, మధ్యప్రదేశ్ లో 1279, మహారాష్ట్ర లో 216, మణిపూర్ లో 40, మిజోరంలో 10, ఒడిశాలో 144, రాజస్థాన్ లో 316, ఉత్తర ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో 9, సిక్కిం లో 44, త్రిపుర లో 58 పోస్టులు భర్తీ చేయనున్నారు.

వివిధ పోస్టులకు కావలసిన విద్యార్హతలు ఇవే..

ప్రిన్సిపల్ పోస్టులకు గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి 45 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ, బీ ఎడ్ లేదా దానికి సమానమైన డిగ్రీ కలిగి ఉండాలి అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బోధనా నైపుణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.

వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ, బీ ఎడ్ లేదా దానికి సమానమైన డిగ్రీ కలిగి ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.

పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ ల్లో మాస్టర్ డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బోధనా నైపుణ్యం తప్పనిసరి.

టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ ల్లో బ్యాచిలర్ డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణత, సంబంధిత సబీజెక్టుల్లో సీటెట్/టెట్ లో అర్హత సాధించి ఉండాలి.  అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బోధనా నైపుణ్యం తప్పనిసరి.

ఎంపిక ఇలా..

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) అలాగే ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అయితే, టీజీటీ అభ్యర్థులకు మాత్రం ఇంటర్వ్యూ ఉండదు. ఈ అర్హత పరీక్షలు ఆయా ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గమనించవలసిన విషయాలు:

దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2021

పరీక్ష తేదీ: జూన్ మొదటి వారంలో

వెబ్సైట్: http://tribal.nic.in/

Also Read: Mumbai as cocaine capital: డ్రగ్స్ దందాపై ఎన్‌సీబీ సంచలన నిజాలు వెల్లడి.. ఆస్ట్రేలియా, కెనడాతో ముంబై లింకులు..!

రేషన్ కార్డు దారులకు గుడ్‌ న్యూస్‌.. మీ కార్డ్‌పై వచ్చే ఆహార పదార్థాల సమాచారం ఇలా తెలుసుకోండి..