
హైదరాబాద్, జనవరి 8: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) పరీక్షల హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 7న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
నవోదయ ప్రవేశ పరీక్ష 2026 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, పరీక్ష తేదీ, రిపోర్టింగ్ సమయం, పరీక్షా కేంద్రం చిరునామా, కీలక సూచనలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్‌లో పేర్కొన్న అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏదైనా వ్యత్యాసం లేదా స్పెల్లింగ్ తప్పు ఉంటే వారు వెంటనే సరిదిద్దు కోవడానికి NVSని సంప్రదించవల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పు వివరాలతో పరీక్ష కేంద్రానికి వెళ్తే అక్కడ అనర్హతకు దారితీయవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల చేశామని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ అభ్యర్థులకు సంబంధించిన 11వ తరగతి అడ్మిట్ కార్డులను మాత్రం తర్వాత విడుదల చేస్తామని NVS తెలియజేసింది.
మరోవైపు 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 2 విడతల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో 2025 డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ఇప్పటికే నిర్వహించారు. ఇక రెండవ దశ పరీక్ష 2026 ఏప్రిల్ 11న ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.