JNTU Admissions 2024: అనంతపురం జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తు విధానం ఇదే

|

Dec 04, 2023 | 9:47 PM

అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ.. వివిధ స్పషలైజేషన్‌లలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ అడ్మిషన్లు వర్కింగ్‌ ప్రొఫెషనల్‌ అభ్యర్థులకు మాత్రమే కేటాయించనున్నారు. పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (పార్ట్ టైం/ ఫుల్ టైం) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రొఫెషనల్స్‌, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలకు చెందిన సైంటిస్ట్‌లు మాత్రమే..

JNTU Admissions 2024: అనంతపురం జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తు విధానం ఇదే
JNTU Admissions 2024
Follow us on

అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ.. వివిధ స్పషలైజేషన్‌లలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ అడ్మిషన్లు వర్కింగ్‌ ప్రొఫెషనల్‌ అభ్యర్థులకు మాత్రమే కేటాయించనున్నారు. పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (పార్ట్ టైం/ ఫుల్ టైం) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రొఫెషనల్స్‌, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలకు చెందిన సైంటిస్ట్‌లు మాత్రమే అర్హులు. సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అయిదేళ్ల పని అనుభవం కూడా ఉండాలి.

విభాగాల వివరాలు.. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఇంగ్లిష్, ఫుడ్ టెక్నాలజీ. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. డిసెంబర్‌ 16, 2023వ తేదీని దరఖాస్తుకు తుది గడువుగా నిర్ణయించారు. అడ్రస్.. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీ యూనివర్సిటీ అనంతపురం.. ఈ అడ్రస్‌కు స్పీడ్ పోస్టు/ కొరియర్ ద్వారా దరఖాస్తును పంపాలి.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇస్రోలో 526 ఉద్యోగాలకు రాత పరీక్ష.. డిసెంబర్‌10న ఎగ్జామ్‌

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)లో వి526 ఉద్యోగాల రాత పరీక్ష తేదీలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్‌ 10న రాత పరీక్ష జరుగనుంది. మొత్తం 526 అసిస్టెంట్, జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ ఖాళీలకు ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌, స్టెనోగ్రఫీ టెస్ట్‌ తదితర పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. డిసెంబర్‌ 10వ తేదీన రాష్ట్ర స్థాయి నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌) కూడా జరుగుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షకు మొత్తం 28,704 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరిన్ని విద్యాసంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.