JEE Main Exams: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే
JEE Main 2022: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో(IIT) ప్రవేశాల కోసం జేఈఈ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) షెడ్యూల్ ప్రకారం.. వాస్తవానికి ఈ పరీక్షలు రేపటి (జులై 21) నుంచి ప్రారంభమై.. ఈనెల 30న ముగియాల్సి ఉంది.
JEE Main 2022: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో(IIT) ప్రవేశాల కోసం జేఈఈ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) షెడ్యూల్ ప్రకారం.. వాస్తవానికి ఈ పరీక్షలు రేపటి (జులై 21) నుంచి ప్రారంభమై.. ఈనెల 30న ముగియాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో జేఈఈ పరీక్షలు వాయిదావేసినట్లు ఎన్‌టీఏ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడ్డ పరీక్షలు జులై 25 నుంచి ప్రారంభమవుతాయని అందులో పేర్కొంది. పరీక్షలకు సంబంధించి రేపట్నుంచి వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సుమారు 6,29,778 మంది సెషన్ 2 పరీక్షలకు హాజరుకానున్నారు.
కాగా జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు జూన్ 23, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక పరీక్షకుల సంబంధించి అదనపు సమాచారం కోసం అలాగే అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ కోసం విద్యార్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 011 – 40759000 నంబర్ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..