JEE MAIN 2026 City Intimation Slips: మరో 2 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

2062-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 కు సంబంధించి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో రెండు, మూడు రోజుల్లో విడుదల చేసేందుకు..

JEE MAIN 2026 City Intimation Slips: మరో 2 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
JEE Main 2026 City Intimation Slip

Updated on: Jan 05, 2026 | 3:57 PM

హైదరాబాద్‌, జనవరి 5: దేశవ్యాప్తంగా ఉన్నఎన్‌ఐటీల్లో 2062-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 కు సంబంధించి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో రెండు, మూడు రోజుల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ పరీక్షకు సంబంధించిన సిటీ వివరాలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఇందులో కేవలం పరీక్ష కేంద్రం ఏ నగరంలో వస్తుంది.. అనే విషయం మాత్రమే ఉంటుంది. పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం వివరాలు ఈ స్లిప్‌లో పొందుపరచరు. ఆ వివరాలు జేఈఈ మెయిన్‌ అడ్మిట్ కార్డులు విడుదలైన తర్వాత మాత్రమే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అడ్మిట్‌ కార్డులు పరీక్ష తేదీకి సరిగ్గా 4 రోజుల ముందు మాత్రమే విడుదలవుతాయి.

కాగా జేఈఈ మెయిన్‌ 2026 జనవరి సెషన్‌ పరీక్షలు జనవరి 21వ తేదీ నుంచి 30 వరకు మొత్తం 11 రోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది. రోజుకు రెండు షిఫ్టుల వారిగా ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ ఏడాది తొలి సెషన్‌కు దరఖాస్తులు కూడా భారీగానే అందాయి. గత మూడేళ్లతో పోలిస్తే 2026 జనవరి జేఈఈ మెయిన్‌ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. మొత్తం 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఎన్టీఏ వెల్లడించింది. అంటే గత ఏడాది జనవరి సెషన్‌ కంటే దాదాపు లక్షకుపైగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఏటా జనవరి, ఏప్రిల్‌ సెషన్లలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) రెండు సార్లు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సెషన్లలో బెస్ట్‌ స్కోర్‌ను మాత్రమే అంతిమంగా తీసుకుంటారు. జేఈఈ మెయిన్‌లో మొదటి 2.50 లక్షల ర్యాంకర్లకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్‌-2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.